Asianet News TeluguAsianet News Telugu

జమ్మలమడుగులో మారుతన్న సమీకరణాలు: ఈ నెల 20న టీడీపీలోకి దేవగుడి నారాయణరెడ్డి

ఈ నెల 20వ తేదీన దేవగుడి నారాయణరెడ్డి ఆయన తనయుడు భూపేష్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు.చంద్రబాబునాయుడు సమక్షంలో నారాయణరెడ్డి తన వర్గీయులతో టీడీపీ కండువా కప్పుకొంటారు.

Devagudi Narayana Reddy to join in Tdp on oct 20
Author
Jammalamadugu, First Published Oct 17, 2021, 4:42 PM IST


కడప: కడప జిల్లాలోని Jammalamadugu అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో దేవగుడి నారాయణరెడ్డి తన వర్గంతో టీడీపీలో చేరనున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడడంతో దేవగుడి నారాయణరెడ్డి వర్గం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం టీడీపీకి కలిసి రానుందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

also read:అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు: రామసుబ్బారెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

ఈ నెల 20వ తేదీన చంద్రబాబునాయుడు సమక్షంలో  Devagudi narayana reddy, ఆయన తనయుడుBhupesh Reddy టీడీపీలో చేరనున్నారు. దేవగుడి నారాయణ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి Adinarayana Reddy ప్రస్తుతం Bjpలో ఉన్నారు. దీంతో నారాయణరెడ్డి Tdp లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  Chandrababu కూడ దేవగుడి కుటుంబానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ ఇంచార్జీగా భూపేష్ రెడ్డిని నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా Ramasubba Reddyపై విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు. చంద్రబాబు కేబినెట్ లో ఆదినారాయణరెడ్డి చేరారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వ విప్ గా నియమించాడు. 

2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలయ్యాక కొంతకాలానికి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. గత ఏడాది రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఈ నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. దేవగుడి కుటుంబానికి  పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇరు కుటుంబాలకు చెందిన కీలక వ్యక్తులు మరణించారు. ఈ  ఫ్యాక్షన్ గొడవలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ కేసు విషయమై రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో షాద్‌నగర్ జంట హత్యల కేసు విషయమై తన మంత్రివర్గం నుండి రామ సుబ్బారెడ్డిని చంద్రబాబు తొలగించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios