భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఇది మిగిలిన వారికి వ్యాపించకుండా ఉండాలంటే అనుమానితులకు వేగంగా పరీక్షలు నిర్వహించాలి. అయితే భారతదేశం ఇప్పుడున్న పరిస్ధితుల్లో దేశంలో వేగంగా పరీక్షల నిర్వహణ తేలికైన అంశం కాదు.

Also Read:కన్నా..! ఆరోపణలు నిరూపిస్తే రేపే పదవికి రాజీనామా చేస్తా: మంత్రి బుగ్గన సవాల్

కానీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం కోవిడ్ 19 పరీక్షలు చేయడంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న ఏపీ మరో ఘనతను సాధించింది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు లక్షకు పైగా కరోనా వైరస్ నిర్వహించనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రికార్డు స్థాయిలో 1,02,460 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 7,902 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా... 60 మందికి కోవిడ్ 19 సోకినట్లు శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,463కు చేరుకుంది.

Also Read:కర్నూలు మెడికల్ కాలేజీలో కలకలం: హాస్టల్లో వంటమనిషికి పాజిటివ్

తాజాగా 82 మంది కోలుకుని ఐసోలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 403కు చేరుకుంది. మరోవైపు వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు విడవటంతో మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది.