అమరావతి: కరోనా కిట్స్ కొనుగోలు విషయంలో అవినీతిని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సవాల్ విసిరారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకుగాను కరోనా కిట్స్ ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా కరోనా కిట్స్ ను కొనుగోలు చేసినట్టుగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారని ఆయన శుక్రవారం నాడు మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

also read:కరోనా దెబ్బ: నరసరావుపేట కమిషనర్ శివారెడ్డి కావలికి బదిలీ

తాను ఎలాంటి సంస్థకు డైరెక్టర్ గా లేనని చెప్పారు. తాను డైరెక్టర్ గా ఉన్న సంస్థ ద్వారా కరోనా కిట్స్ కొనుగోలు చేసినట్టుగా నిరూపిస్తే మే 2వ తేదీ ఉదయమే తాను పదవికి రాజీనామా చేస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

రేపు ఉదయం 9 గంటలలోపుగా ఈ విషయమై ఆధారాలను నిరూపించాలని కన్నాను డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను నిరూపించకపోతే  బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లక్ష్మీనారాయణను కోరారు.ఇంత వయసొచ్చినా కూడ కన్నా ఇలా మాట్లాడడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.