ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఈ ఘటనపై ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ  ఘటనపై సిఐఎస్ఎఫ్( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) తో పాటు ఫలె సంస్థలను విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనపై భాద్యులేవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు సురేష్ ప్రభు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అయితే విచారణను వేగవంతంగా జరిగేలా చూస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. 

జగన్ పై జరిగిన దాడిని ఏపి బిజెపి నాయకుడు సోము వీర్రాజు కూడా స్పందించారు. రాజకీయ నాయకులపై ఆటువంటి దాడులు జరగడం దారుణమని అన్నారు. కోళ్ల పందాలకు వాడే కత్తి చాలా పదునుగా ఉంటుందని...జగన్‌ను చంపడానికే ఈ దాడి చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కుట్రపూరితంగా ఈ దాడి జరిగి ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. 


సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు