అమరావతి: విశాఖపట్టణం జిల్లాలోని పెందుర్తి మండలం గిరిప్రసాద్ కాలనీలో శిరోముండనానికి గురైన బాధితుడు శ్రీకాంత్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఫోన్ చేశాడు. ఈ ఘటన  గురించి ఆయన అడిగి తెలుసుకొన్నారు.

సెల్‌ఫోన్ అయిందని ఇంటికి పిలిచి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనను ఖండించారు. తప్పు చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి... కానీ ఇలా శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.బాధితుడితో చంద్రబాబునాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు ఆయనకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. 

also read:దళితులపై దాడుల విషయమై జగన్ ఎందుకు స్పందించలేదు: బాబు

విశాఖపట్టణంలోని టీడీపీ నేతలతో పాటు దళిత నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దళితులపై దాడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు.

also read:శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.బాధితుడు శ్రీకాంత్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ పరామర్శించారు. బాధితుడికి లక్ష రూపాయాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఇళ్ల పట్టా ఇస్తామని హామీ ఇచ్చారు.