నెల్లూరు: నెల్లూరు జిల్లాలో  టీడీపీ నేతలు సమన్వయంగా పనిచేయాలని టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు సూచించారు. పార్టీ బలంగా ఉన్న నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగా  పార్టీ నష్టపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే పార్టీ నేతలను తన వద్దకు తీసుకురావాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాబు సూచించారు.నెల్లూరులో వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించేందుకు గాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు.

గత ఎన్నికల సమయంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. అయితే ఈ దఫా ఈ జిల్లాలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించాలని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్లాన్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డిలతో పాటు ఆ జిల్లా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై బాబు సమీక్ష నిర్వహించారు. కోవూరులో పార్టీ బలంగా ఉన్నప్పటికీ  పార్టీ నేతల మధ్యే సఖ్యత  లేదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు మధ్య సఖ్యత లేదని  ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలంతా విబేధాలు వీడి పార్టీ కోసం  పనిచేయాలని  ఆయన సూచించారు.  ఈ విషయమై ప్రత్యేకంగా చొరవ చూపాలని నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరారు.

జిల్లాలోని కోవూరు, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిపై  చంద్రబాబునాయుడు చర్చించారు. కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో  పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని  బాబు గుర్తు చేశారు.

 ప్రజలు పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డితో బాబు చెప్పారు. పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయనతో విబేధించిన స్థానిక నేతలను తన వద్దకు తీసుకురావాలని  బాబు ఆదేశించారు.

మీతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి పనిచేస్తే  నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ కైవసం చేసుకొంటుందని  బాబు అభిప్రాయపడ్డారు. రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే రిపోర్ట్‌ను బాబు ఆదాలకు వివరించారు.  

ఈ విషయమై చంద్రబాబునాయుడు  పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ అవసరాల రీత్యా చంద్రబాబునాయుడు ఈ నియోజకవర్గంలో  సోమిరెడ్గి చంద్రమోహన్ రెడ్డి,  ఆదాల ప్రభాకర్ రెడ్డిలు కలిసి పనిచేయాలని సూచించారు. రూరల్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలని బాబు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

జగన్‌ కోటను ఢీకొట్టే బాబు ప్లాన్ ఇదీ

అది పవన్ ఇష్టం: మరోసారి జనసేనానికి బాబు ఆఫర్

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్‌కు చెక్: పవన్ తో దోస్తీకి బాబు ప్లాన్?

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ