జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే  జగన్‌కు ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.


అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ను ఘాటుగా విమర్శలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్‌ బీజేపీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి కలిసి రావాలని ఆయన కోరారు.

పవన్ మాతో కలిసి రాకుండా ఉండేందుకు జగన్ ‌ ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని బాబు ఆరోపించారు.ఏపీ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పవన్ కళ్యాణ్ కలిసి రావాలని ఆయన కోరారు. బీజేపీ, టీఆర్ఎస్‌, వైసీపీలు ఓ కూటమిగా ఉన్నారని టీడీపీ చీఫ్ ఆరోపిస్తున్నారు.

అసలు బీజేపీతో, టీఆర్ఎస్‌తో కలిసి లేమని వైసీపీ చెప్పగలదా అని బాబు ప్రశ్నించారు.జగన్ ‌ఎవరితో ఉన్నారో స్పష్టత ఇవ్వాలని బాబు తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర అవుతున్నారనే కారణంగానే జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ