అమరావతి:పవన్ కళ్యాణ్ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో  సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నాయి.బీజేపీకి వ్యతిరేకంగా జనసేన తమతో కలిసి పనిచేయాలని చంద్రబాబునాయుడు ఆఫర్ ఇచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్న చంద్రబాబునాయుడు ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్‌ను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాన్ని ప్రారంభించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ,, టీడీపీల కూటమికి జనసేన మద్దతుగా నిలిచింది. అయితే రెండేళ్ల నుండి  జనసేన టీడీపీ తీరును తప్పుబడుతోంది. ఏపీ లో చోటు చేసుకొన్న పరిణామాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ‌ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు సహా  ఆ  పార్టీకి చెందిన నేతలపై నేరుగానే విమర్శలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. త్వరలోనే ఏపీలో  ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని టీడీపీ  ఆరోపిస్తోంది. ఈ తరుణంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ కూడ తమతో కలిసి రావాలని బాబు పిలుపు ఇచ్చారు. అయితే జనసేనతో  ఏర్పడిన గ్యాప్‌ను తొలగించుకొనేందుకు గాను టీడీపీ నాయకత్వం నుండి ఇటీవల కాలంలో ప్రయత్నాలు జరిగినట్టు  కూడ ప్రచారంలో ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడ టీడీపీ నేతలపై విమర్శల దాడిని కొంత మేరకు తగ్గించారనే ప్రచారంలో కూడ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర అవుతున్నారనే ఉద్దేశ్యంతోనే జగన్ కూడ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని చూపుతూ ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని టీడీపీ సవాల్ విసురుతోంది. ఇప్పటికే బీజేపీతో వైసీపీ అంటకాగుతోందనే ప్రచారాన్ని టీడీపీ చేస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేస్తోంది.

బీజేపీ వ్యతిరేక పోరాటంలో తమతో కలిసి రావాలని పవన్ ను బాబు కోరడం వ్యూహత్మక ఎత్తుగడగానే విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటని చంద్రబాబునాయుడు  చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలతోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతోందా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం. అయితే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో పార్టీలను కూడగట్టడంలో బాబు కీలకంగా ఉన్నారు.ఏపీలో ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారు. 

లెఫ్ట్ పార్టీలు కూడ బాబు కూటమిలో ఉంటామని స్పష్టం చేశాయి.  ఇవన్నీ పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ను తమతో కలిసి రావాలని  చంద్రబాబునాయుడు  కోరడం కూడ బీజేపీ వ్యతిరేక పార్టీలను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో  భాగంగా బాబు పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 

పవన్ కళ్యాణ్‌ను బాబు ఆహ్వానించడం  రాజకీయంగా  వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వపన్, జగన్ కలిస్తే ఏపీలో చంద్రబాబునాయుడును రాజకీయంగా దెబ్బకొట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

ఈ తరుణంలో పవన్ తో జట్టు కట్టి పోటీ చేస్తే జగన్ కు నష్టమేమిటనే బాబు వ్యాఖ్యలు మాత్రం రానున్న రోజుల్లో  ఏపీలో  రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. పవన్ ను దూరం చేసుకోకూడదనే భావనతోనే బాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు కూడ విన్పిస్తున్నాయి.జగన్ ను దెబ్బకొట్టే ఉద్దేశ్యంతోనే పవన్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకే బాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

మరో వైపు బాబు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. టీడీపీకి జనసేన ఎప్పటికి మద్దతుగానే ఉంటుందని తాము చెబతున్నది వాస్తవమేనని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. టీడీపీకి పవన్ కళ్యాణ్ దగ్గర అవుతున్నారనే భావనతోనే జగన్  ఆయనను తీవ్రంగా తిడుతున్నారని బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన ఏ రకంగా స్పందిస్తోందో వేి చూడాలి.

సంబంధిత వార్తలు

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ