అమరావతి: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే  మోడీ ఎందుకు సంతోషంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  కేంద్రంపై అక్కసుతో తాను మాట్లాడడం లేదన్నారు. దేశానికి మోడీఏం చేశారో చెప్పాలన్నారు. ఈ విషయమై చర్చకు తాను సిద్దమని చెప్పారు.

మంగళవారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. దేశానికి మోడీ ఏం చేశారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో బీజేపీకి ఐదు స్థానాల నుండి ఒక్క స్థానానికే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.బీజేపీ ప్రెసిడెంట్  అమిత్ షా 7 దఫాలు, మోడీ రెండు దఫాలు, 13 మంది కేంద్ర మంత్రులు, ముగ్గురు సీఎంలు తెలంగాణలో ప్రచారం చేసినా కూడ బీజేపీ ఒక్క సీటుకే పరిమితమైందని బాబు ఎద్దేవా చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే మోడీ ఎందుకు సంతోషపడుతున్నాడో చెప్పాలన్నారు.బీజేపీకి ఒక్క సీటు వస్తే మీకు ఆనందం కలుగుతోందా అని మోడీని బాబు నిలదీశారురాజ్యాంగ వ్యవస్థలను మోడీ నాశనం చేశారని ఆయన ప్రశ్నించారు. దేశానికి మోడీ ఏం చేశారో మోడీ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. చర్చకు సిద్దమా అని ఆయన మోడీకి సవాల్ విసిరారు.

మీ వల్ల దేశానికి ఏం లాభమని  ఆయన మోడీని ప్రశ్నించారు.కేంద్రంపై తాను అక్కసుతో మాట్లాడడం లేదన్నారు. అర్థవంతంగా మాట్లాడుతున్నానని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 

సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐలతో పాటు కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. రాజకీయ పార్టీలపై, రాజకీయ పార్టీ నేతలపై  దాడులు చేస్తున్నారని మోడీపై బాబు విరుచుకుపడ్డారు. దేశంలో ఈ రకమైన దుర్మార్గం ఏనాడూ జరగలేదన్నారు.

రాజకీయ నాయకులపై దాడులు చేస్తూ భయపెడతారా.. బెదిరిస్తారా అని బాబు ప్రశ్నించారు. మీ ఆర్థిక నమూనా ఏం పనిచేసిందో చెప్పాలని మోడీని బాబు నిలదీశారు.యూపీఏ,ఎన్గీఏ పాలనకు మధ్య అభివృధ్ది ఏ మేరకు పెరిగిందో చెప్పాలని బాబు ప్రశ్నించారు. జీఎస్టీ వల్ల, నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

అవినీతిని కంట్రోల్ చేస్తానని చెప్పి ఎందుకు కంట్రోల్ చేయలేదో చెప్పాలన్నారు. అవినీతికి పాల్పడిన వారంతా దేశం వదిలి ఎందుకు తప్పించుకొన్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.రాఫెల్ కుంభకోణం గురించి ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ఆయన కోరారు.

దేశాన్ని భ్రష్టుపట్టించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని  లేకుండా చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని బాబు ప్రశ్నించారు. కేసీఆర్ మోడీని అసభ్యంగా మాట్లాడితే తప్పు కాదా.. మేం మాట్లాడితేనే బాధ అని ఆయన ప్రశ్నించారు.

.సంబంధిత వార్తలు

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ