Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై దాడి కేసు ఎన్ఐఏకు అప్పగింత: కోర్టులను ఆశ్రయించే యోచనలో బాబు

 విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

chandrababu naidu discussion on jagan case isue
Author
Amaravathi, First Published Jan 5, 2019, 9:45 PM IST

అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు అమరావతిలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, అడ్వకేట్ జనరల్, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జగన్ పై దాడికేసుకు సంబంధించి న్యాయపోరాటంపై చర్చిస్తున్నారు. 

దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టులను ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న అంశంపై చర్చించారు. 

న్యాయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరశిస్తూ కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాయాలని చంద్రబాబు నాయడు నిర్ణయించుకున్నారు. 

ఇకపోతే జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్ఐఏకు అప్పగించడంపై మండిపడ్డారు. కేంద్రం కావాలనే జగన్ కు సహకరించేలా ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. 

జగన్ పై దాడికి పాల్పడింది ఒక దళితుడు అని అతను జగన్ కు సానుభూతి రావాలన్న ఉద్దేశంతో దాడి చేశాడని ఒప్పుకున్నాడని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తమప్రభుత్వం సిట్ వేసిందని, ఎన్నో విచారణలు చేసిందని అలాంటి కోడికత్తి కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగిస్తారా అంటూ మండిపడ్డారు.

జగన్ పై దాడి కేసులో సిట్ ను నియమించామని కేసు హైకోర్టులో ఉన్నందున ఎలాంటి నివేదిక సమర్పించలేదని చెప్పారు. అనుమతిస్తే రికార్డులను కోర్టు ముందు ఉంచేందుకు తాము సిద్ధమని చెప్పామని అయినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

తాము విచారిస్తామన్నట్లుగా కేంద్రప్రభుత్వం దాడికేసులో ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. రాష్ట్ర హక్కులను హస్తగతం చేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇది న్యాయమా అంటూ ప్రశ్నించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై హత్యాయత్నం కేసు: అడ్డం తిరిగిన సిట్, ఆయన సెలవు

జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

ఎన్ఐఎ అదుపులోకి శ్రీనివాస రావు: న్యాయవాది సలీం వెల్లడి

జగన్ పై దాడి కేసులో మలుపు: శ్రీనివాస రావు కస్టడీపై ఉత్కంఠ

జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు

 

Follow Us:
Download App:
  • android
  • ios