కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు పెళ్లి సంబంధం మాట్లాడేందుకు విజయవాడ వచ్చారంటూ వస్తున్న వార్తలపై ప్రాఫిట్ షూ మార్ట్ అధినేత కొల్లు కోటేశ్వరరావు స్పందించారు. కుమారుడి పెళ్లి సంబంధం కోసం ఆయన విజయవాడ రాలేదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

కుమారస్వామి కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నారు. ఆ అనుబంధంతోనే కుమారస్వామి దంపతులను భోజనానికి పిలిచామని అన్నారు.

కాగా... కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ‌, ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కుమార్తె ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లి విషయం మాట్లాడేందుకే కర్ణాటక సీఎం దంపతులు బెజవాడ వచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

విజయవాడ అమ్మాయితో కుమారస్వామి తనయుడి వివాహం.. ఇవాళే పెళ్లిచూపులు..?

చంద్రబాబు వద్దకు రాహుల్ దూతగా కుమారస్వామి..?

ఏకతాటిపైకి రావాలి.. చంద్రబాబుతో కుమారస్వామి భేటీ