కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మర్యాదపూర్వకంగానే తాను కుమారస్వామితో భేటీ అయ్యానని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. దక్షిణాదిలోని అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోసారి తామిద్దరం భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై వెంచేసియున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుమారస్వామి విజయవాడ చేరుకున్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రికి ఏపీ అధికారులు ఘనస్వాగతం పలికారు.