విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నక్కపల్లి తహశీల్దార్ ఆఫీసులో మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగి అటెంబర్ సత్తిబాబు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముందు జాగ్రత్తగా శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో నక్కపల్లి తహశీల్దార్ ఆఫీసులో శానిటైజర్‌ను ఉంచారు.

అయితే శనివారం మధ్యాహ్నం అటెండర్ సత్తిబాబుకు బాగా దాహం వేయడంతో .. పక్కనే వున్న శానిటైజర్‌ను మంచినీళ్లు అనుకుని తాగేశాడు. ఆ వెంటనే సత్తిబాబు అస్వస్ధతకు గురయ్యాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతనిని ఇంటికి పంపారు.

అయితే ఇంటికి వెళ్లిన తర్వాత సత్తిబాబు మరోసారి అస్వస్దతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో కుటుంబసభ్యులు మళ్లీ ఆసుపత్రికి తరలించగా... ఆదివారం చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో సత్తిబాబు ఇంట్లో విషాదం అలుముకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

Also Read:

లాక్ డౌన్ లో దొరకని మద్యం... శానిటైజర్ తో సారా తయారుచేసి..

చుక్క లేక.. పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకుని తాగి: నెల్లూరులో యువకుడి మృతి