చుక్క లేక.. పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకుని తాగి: నెల్లూరులో యువకుడి మృతి

లాక‌డౌన్ కారణంగా అందరి కంటే ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మందుబాబులే. చుక్క లేనిదే నిద్రపోని వారంతా మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. లిక్కర్ దుకాణాలు మూసేసి నెల రోజులు గడుస్తుండటంతో మద్యం చుక్క కోసం అల్లాడిపోతున్నారు.

coronavirus lockdown: young man died in nellore over

లాక‌డౌన్ కారణంగా అందరి కంటే ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మందుబాబులే. చుక్క లేనిదే నిద్రపోని వారంతా మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. లిక్కర్ దుకాణాలు మూసేసి నెల రోజులు గడుస్తుండటంతో మద్యం చుక్క కోసం అల్లాడిపోతున్నారు.

లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వైన్‌షాపులు తెరిచే అవకాశం లేకపోవడంతో కొందరు సర్దుకుపోతుంటే.. మరికొందరు మాత్రం ఏవేవో రసాయనాలు కలుపుకుని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: పెళ్లి ఆగిపోయిందనే మనోవేదనతో యువతి ఆత్మహత్య

తాజాగా నెల్లూరు జిల్లాలలో ఓ యువకుడు పెట్రోల్‌లో శానిటైజర్ కలుపుకుని తాగి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. మర్రిపాడు మండలం డీసీ పల్లి ఎస్సీ  కాలనీకి చెందిన నలిపోగు నరేశ్ నిత్యం మద్యం తాగేవాడు.

లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడటంతో చుక్క లేక వెర్రెత్తిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం నుంచి నరేశ్ ఇంటి నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో స్థానికులు అతని ఇంట్లోకి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.

Also Read:ఏపీలో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 44 కొత్త కేసులు, మొత్తం 647కి చేరిక

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం దొరక్క ఇంట్లో ఉన్న శానిటైజర్‌‌ను పెట్రోల్‌లో కలుపుకుని తాగడంతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios