ఏపీఎస్ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్: 7,600 మంది ఉద్యోగుల తొలగింపు, రోడ్డున పడ్డ కుటుంబాలు

సుమారు  7,600 వేల మంది పొరుగు సేవల సిబ్బంది (ఔట్‌ సోర్సింగ్)ని తొలగిస్తూ ఆర్టీసీ ప్రకటించింది

APSRTC removed 7,600 Outsourcing employees from duties

కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధల నానాటికి దిగజారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఎన్నో దేశాల్లో ప్రతిరోజూ లక్షల్లో ఉద్యోగాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా దీని ప్రభావం ఏపీఎస్ఆర్టీసీ మీదా పడింది.

ఈ సంస్థలో విధులు నిర్వహిస్తున్న సుమారు  7,600 వేల మంది పొరుగు సేవల సిబ్బంది (ఔట్‌ సోర్సింగ్)ని తొలగిస్తూ ఆర్టీసీ ప్రకటించింది. శుక్రవారం నుంచి విధులకు హాజరుకావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేవారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి ఆదేశాల మేరకు వీరిని విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు.

Also Read:రాజధాని భూముల వ్యవహారంపై జగన్‌కు ఏపీ హైకోర్టు షాక్.. ఆర్-5 జోన్‌పై స్టే

మరోవైపు ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ .. రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసింది.

లాక్‌డౌన్ కారణం చూపి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు భిన్నంగా ఆర్టీసీ యాజమాన్యం పొరుగు సేవల ఉద్యోగులు, సిబ్బందిని తొలగించిందని కార్మిక నేతలు అన్నారు.

ఆర్టీసీ తీరు కారణంగా ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడే పరిస్ధితి నెలకొందని వారు నాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని ఆర్టీసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:రాజధాని తరలింపు, 150 రోజులుగా ఆందోళన... చీమకుట్టినట్లు లేదు: జగన్‌పై బాబు విమర్శలు

కాగా విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం  సహా రాష్ట్రంలోని ప్రాంతీయ మేనేజర్ల కార్యాలయాలు, బస్సు డిపోలు, వర్క్‌‌షాపులు, ఆసుపత్రుల్లో దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

వీరిలో స్వీపర్లు, అటెండర్లు, గ్రేడ్ 4 స్థాయి ఉద్యోగులే ఉన్నారు. వీరికి ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వలేదని యూనియన్ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios