రాయపాటికి వల: సిబిఐ డైరెక్టర్ నాకు సన్నిహితుడు, తనకు జగన్ తెలుసు

సిబిఐ కేసు నుంచి తప్పిస్తామని, తమకు డబ్బులు ఇవ్వాలని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావును సంప్రదించిన వ్యక్తిని సిబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదు మణిందర్ రెడ్డిని, మదురైకి చెందిన సెల్వం రామరాజ్ ను అరెస్టు చేశారు.

Approached Rayapati: CBI arrests two for spoofing calls, demanding bribes

గుంటూరు: సిబిఐ కేసు నుంచి తప్పిస్తానని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు వల వేసిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సిబిఐ అధికారులు పట్టుకున్నారు. తాను సిబిఐలో పనిచేస్తున్నానని చెప్పి రాయపాటి సాంబశివ రావును మభ్య పెట్టడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. 

"నేను సిబిఐలో పనిచేస్తున్నాను. నాకు సిబిఐ డైరెక్టర్ బాగా సన్నిహితుడు, ముఖ్యమంత్రి జగన్ కూడా తనకు బాగా తెలుసు. మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తాను" అని చెప్పి ఓ వ్యక్తి రాయపాటి నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నించాడు. 

Also Read: రాయపాటిపై ఈడీ కేసు: బంగారు చీర విరాళంపై సిబిఐ ఆరా

ఇటీవల బ్యాంక్ రుణాలకు సంబంధించి ట్రాన్స్ టాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ పైనే కాకుండా కంపెనీ డైరెక్టర్ గా ఉన్న రాయపాటిపై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

మణివర్ధన్ రెడ్డి అనే వ్యక్తి రాయపాటికి ఫోన్ చేసి, నేరుగా ఇంటికి వచ్చాడని, అతనిపై అనుమానం వచ్చిన రాయపాటి సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దాంతో రంగంలోకి దిగిన తెలంగాణ సిబిఐ అధికారులు మణివర్ధన్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

Also Read: సంతకాలు చేయమంటే చేశాను.. పెత్తనమంతా శ్రీధర్‌దే: రాయపాటి సాంబశివరావు

హైదరాబాదుకు చెందిన మణివర్ధన్ రెడ్డితో పాటు మదురైకి చెదిన సెల్వం రామరాజ్ ను సిబిఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. జనవరి 16వ తేదీన ఈ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. క్రిమినల్ కుట్ర, చీటింగ్, వ్యక్తుల తారుమారు వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Also Read: మాజీ ఎంపీ రాయపాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios