మాజీ ఎంపీ రాయపాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

cbi files FIR on ex mp rayapati sambasiva rao

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరులలో రాయపాటికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు రాయపాటిపై కేసులు నమోదు చేశారు.

సాంబశివరావుకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థలోనూ సోదాలు చేసిన సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న రాయపాటి సకాలంలో తిరిగి చెల్లించలేదు.

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారు: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

14 బ్యాంకులను ట్రాన్స్‌ట్రాయ్ తప్పుదారి పట్టించిందని యూనియన్ బ్యాంక్ తన ఆడిట్‌లో తేలింది. మొత్తం రూ.3,226 కోట్ల నిధులను ట్రాన్స్‌ట్రాయ్ డైవర్ట్ చేసినట్లుగా తేలింది. అలాగే రూ.794 కోట్లను రైటప్ చేసినట్లు యూనియన్ బ్యాంక్ గుర్తించింది.

రూ.2,298 కోట్ల రూపాయల స్టాక్ ఓవర్ వేల్యూవేషన్ చేయించడంతో పాటు సదరు నిధులను సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు నిధులు మళ్లీంచినట్లుగా తెలిసింది. ఈ 14 బ్యాంకులు తెలియకుండా ట్రాన్స్‌ట్రాయ్ గోల్ మాల్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:న్యూస్ @ 90 సెకండ్స్

రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయాల్లో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఆయనపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్‌ 13(2), రెడ్‌ విత్‌ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసులను నిందితులుగా పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios