అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు ఏవేవో చెప్తారంటూ చంద్రబాబును విమర్శించారు. 

అధికార పార్టీ అడుగుతున్నదానికి చంద్రబాబు నాయుడు చెప్తున్నదానికి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇది దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలపాలని అంటే చంద్రబాబు ఎక్కడికో వెళ్లిపోయాడని పోనీ జీరో వడ్డీ గురించి మాట్లాడమంటే ఇంకెక్కడికోపోయాడంటున్నారు. 

అదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ప్రశ్నిస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాదని బుల్లెట్ దిగిందా లేదా అన్నదే కావాలన్నారు. 

ముఖ్యమంత్రి అడుగుతున్న బుల్లెట్ లాంటి ప్రశ్నలు దిగాయి కాబట్టే వారు డివియేట్ అయిపోయి సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ జీరో వడ్డీ ఇచ్చారో లేదో కూడా చెప్పకుండా తడబడుతున్నాడంటే మా బుల్లెట్ దూసుకెళ్లిందంటూ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మీ అంత సంస్కార హీనులం కాదు, దిగజారకండి: చంద్రబాబుకు మంత్రి బొత్స వార్నింగ్

తమాషాగా ఉందా, జగన్ పై ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు

చంద్రబాబు రూపాయి ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తావా: వైయస్ జగన్ సవాల్

పంతాలకు పట్టింపులకు పోవద్దు, ఎక్కడో ఉంటారు: చంద్రబాబుపై అంబటి ధ్వజం

ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్