సెలక్ట్ కమిటీ విషయంలో జాప్యానికి కారణమైన ఇన్‌ఛార్జ్ సెక్రటరీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశానన్నారు ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఆయన భేటీ అయ్యారు.

అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ఛైర్మన్‌గా తానిచ్చిన రూలింగ్‌ను అమలు పరచకుండా బేఖాతరు చేస్తున్న విషయంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. తనకున్న విచక్షణాధికారంతోనే సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశామని ఛైర్మన్ వెల్లడించారు.

Also Read:సెలక్ట్ కమిటీ రగడ: ఛైర్మన్ ఆదేశాలు బేఖాతరు, రెండో సారి ఫైల్ వెనక్కి.. సెక్రటరీపై టీడీపీ గుర్రు

మండలి చరిత్రలో ఇప్పటి వరకు ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవని, కానీ సెక్రటరీ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.

సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి మండలి ఛైర్మన్ షరీఫ్ పంపిన ఫైలును కార్యదర్శి రెండు సార్లు తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Also Read:సెలక్ట్ కమిటీ వివాదం: బిల్లు ఆమోదం పొందినట్లేనన్న వైసీపీ, ఎలా అన్న టీడీపీ

ఇప్పుడు ఏకంగా మండలి ఛైర్మన్ షరీఫ్ స్వయంగా గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటులో జరుగుతున్న పరిణామాలను ఛైర్మన్ లేఖ రూపంలో గవర్నర్‌కు వివరించారు.