Asianet News TeluguAsianet News Telugu

సెలక్ట్ కమిటీ రగడ: ఛైర్మన్ ఆదేశాలు బేఖాతరు, రెండో సారి ఫైల్ వెనక్కి.. సెక్రటరీపై టీడీపీ గుర్రు

ఆంధ్రప్రదేశ్ శాసనసమండలిలో సెలక్ట్ కమిటీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ మండలి కార్యదర్శి తేల్చేశారు. ఈ మేరకు ఆయన ఫైలును రెండోసారి తిప్పిపంపారు. దీంతో మండలి సెక్రటరీపై టీడీపీ కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. 

ap legislative council secretary again rejected select committee file
Author
Amaravathi, First Published Feb 14, 2020, 8:05 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనసమండలిలో సెలక్ట్ కమిటీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ మండలి కార్యదర్శి తేల్చేశారు. ఈ మేరకు ఆయన ఫైలును రెండోసారి తిప్పిపంపారు. దీంతో మండలి సెక్రటరీపై టీడీపీ కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. 

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా బులెటిన్ విడుదల చేయాలని ఈ నెల 10వ తేదీన టీడీపీ ఎమ్మెల్సీలు సెక్రటరీని కోరారు. అయితే  సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించబోవని సెక్రటరీ మండలి ఛైర్మెన్‌ కు అదే రోజున నోట్ పంపారు.

Also Read:చర్యలు తప్పవు: ఏపీ శాసమండలి సెక్రటరీకి ఛైర్మెన్ షరీఫ్ వార్నింగ్

ఈ విషయమై సెక్రటరీ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని కూడ టీడీపీ భావిస్తోంది.ఇదిలా ఉంటే 14 రోజులు పూర్తైనందున పాలనా వికేంద్రీకరణ బిల్లు,సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పాసైనట్టేనని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది.

అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం అన్ని పార్టీలు తమ పేర్లను పంపించినందున సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా బులెటిన్ విడుదల చేయాలని టీడీపీ  శాసనమండలి సెక్రటరీని కోరింది..సెలెక్ట్ కమిటీ ఏర్పాటు  చేసిన తనకు నివేదించాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్   ఎంఏ షరీఫ్ గురువారం నాడు సెక్రటరీని ఆదేశించారు. 

Also Read:సెలక్ట్ కమిటీ వివాదం: బిల్లు ఆమోదం పొందినట్లేనన్న వైసీపీ, ఎలా అన్న టీడీపీ

సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని   సెక్రటరీ నోట్ పంపండంపై ఛైర్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెలెక్ట్ కమిటీ  ఏర్పాటు విషయంలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని మండలి ఛైర్మెన్ హెచ్చరించారు.

48 గంటల్లో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఛైర్మన్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మండలి సెక్రటరీ మరోసారి ఫైలును తిప్పి పంపడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios