Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం.. ఏపీ ఆ జాబితాలో లేదన్న ఇంధన శాఖ కార్యదర్శి

తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాలపై ఆయా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన ఎక్ఛేంజీల నుంచి రోజువారీ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రానికి సమాచారం అందించామని, దీంతో నిషేధిత జాబితా నుంచి ఏపీని తొలగించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. 
 

ap govt reacts on banning ap to purchagse electricity from exchanges
Author
Amaravati, First Published Aug 19, 2022, 3:57 PM IST

తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాలపై ఆయా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన ఎక్ఛేంజీల నుంచి రోజువారీ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ స్పందించారు. పవర్ ఎక్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఏపీని నిషేధిత జాబితాలో చేర్చారని విజయానంద్ తెలిపారు. కేంద్రం విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదన్న ఆయన.. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ. 350 కోట్లను ఇప్పటికే చెల్లించినట్లు స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించామని, దీంతో నిషేధిత జాబితా నుంచి ఏపీని తొలగించినట్లు విజయానంద్ వెల్లడించారు. 

ఇకపోతే.. కేంద్ర ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి చెల్లింపు విషయంలో డిఫాల్టర్ గా మారడంతో ఇండియన్  పవర్  సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై తెలంగాణకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి పడడంతో తెలంగాణ,ఏపీ సహా మరో 13 రాష్ట్రాలు కేంద్ర పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ నెల 18వ తేదీ రాత్రి నుండి అమల్లోకి వచ్చింది.గతంలో కూడా ఇదే తరహాలో పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై పలు రాష్ట్రాలపై నిషేధం విధించినా వెంటనే తొలగించిన పరిస్థితులున్నాయి. 

ALso REad:తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్: పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1380 కోట్లను పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్  కు బకాయి పడింది.దేశంలో మొత్తం 13 రాష్ట్రాలు సుమారు రూ. 5,080 కోట్లు బకాయిలున్నాయి. ఈ బకాయిలు చెల్లించడానికి గడువు కూడా దాటిపోయింది. ఈ గడువు పూర్తైనా కూడ బకాయిలు చెల్లించని కారణంగా పవర్ సిస్టమ్ నిర్ణయం తీసుకొంది. దేశంలోని  అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రమే ఈ కార్పోరేషన్ కు ఎక్కువ నిధులు బకాయి పడింది. అన్ని రాష్ట్రాలు వెయ్యి కోట్ల లోపుగానే బకాయిలుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం రూ., 1380 కోట్లు బకాయిలు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 412 కోట్లు మాత్రమే బకాయి  చెల్లించాల్సి ఉంది. 

తెలంగాణలో విద్యుత్ ను ఉత్పత్తి చేసే జెన్ కోకు అన్ని బకాయిలను చెల్లించామని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో చైర్మెన్ ప్రభాకర్ రావు  మీడియాకు తెలిపారు.నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విద్యుత్ సరపరాను క్రమబద్దీకరిచేందుకు ఉద్దేశించిన సంస్థ అని ప్రభాకర్ రావు చెబుతున్నారు. అయితే వాణిజ్య పరమైన అంశాలపై ఈ సంస్థ జోక్యాన్ని ప్రభాకర రావు తప్పు బడుతున్నారు. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పాత్రను కోర్టులో సవాల్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై స్టే ఆర్డర్ ఉందని ఆయన వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios