Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్: పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం

కేంద్ర విద్యుత్ శాఖ 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. బకాయలు చెల్లించని కారణంగా 13 రాష్ట్రాల డిస్కంలు  ఇండియన్  పవర్  సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్   నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా  నిర్ణయం తీసుకుంది. 

 Union Power Ministry bars 13 states from power exchange
Author
hyderabad, First Published Aug 19, 2022, 9:32 AM IST

హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది.   ఇండియన్  పవర్  సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు  చేయకుండా నిషేధం విధించింది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుండి ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాలకు చెందిన డిస్కంలకు కేంద్ర విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం షాకిచ్చింది. 

ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్చేంజ్  బోర్డు నుండి విద్యుత్ కొనుగోలు చేసినా కూడా దానికి సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజులు దాటినా కూడా దీనికి సంబంధించిన డబ్బులను చెల్లించకపోవడంతో కేంద్ర విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. కేంద్ర విద్యుత్ శాఖకు ఆయా రాష్ట్రాల నుండి సుమారు రూ. 5 ,800 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది.ఈ బకాయిలను రాష్ట్రాలు చెల్లించని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. 

నిర్ణీత సమయంలో బకాయిల చెల్లించకపోతే 3 శాతం సర్ చార్జీలను డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలానే బకాయిల చెల్లించకపోతే జరిమానా నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రూ 76 వేల కోట్లు, ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిల కారణంగా రూ. 67000 కోట్లు బకాయిలు పడ్డాయి. సుమారు రూ. 1,43,000 కోట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ లకు చెల్లిస్తే డిస్కమ్ లు జెన్ కోల బకాయిలను చెల్లించే అవకాశం ఉందని  ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మెన్ శైలేంద్ర దూబే చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారంగా తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు, రాజస్థాన్ రూ.500, జమ్మూ కాశ్మీర్ రూ. 434కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు  ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్చేంజ్ కి  బకాయిలున్నాయి. మహారాష్ట్ర 381, చత్తీస్ ఘడ్ రూ. 274కోట్లు,, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు,జార్ఖండ్ రూ.218 కోట్లు, బీహార్ రూ. 112 కోట్లు  బకాయి పడ్డాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  గడువు తీరి నెల రోజులు దాటినా కూడా  ఆయా రాష్ట్రాలు కేంద్ర పవర్ సంస్థలకు  బకాయిలు చెల్లించలేదు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.

విద్యుత్ బకాయిలు చెల్లింపు అంశం కోర్టులో కేసు నడుస్తుందని తెలంగాణకు చెందిన విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటామని అధికారులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios