Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ శిల్ప సూసైడ్: బాబు సర్కార్ సీరియస్, హైలెవల్ కమిటీ ఏర్పాటు

డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసును  ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. ఈ ఘటనపై  ఏపీ సర్కార్  డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది.

Ap government appoints high level committee over doctor shilpa suicide case


తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసును  ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. ఈ ఘటనపై  ఏపీ సర్కార్  డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది.

రుయా ఆసుపత్రిలో ప్రోఫెసర్లు తనపై లైంగిక వేధింపులకు  పాల్పడినట్టు  డాక్టర్ శిల్ప  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపారు. ఈ నివేదికను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో మనోవేదనకు గురైన డాక్టర్ శిల్ప  ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనలో డాక్టర్ రవికుమార్ పై వేటు పడింది. మరో ఇద్దరిపై కూడ వేటు వేయాలని  జూడాలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట జూడాలు ఆందోళనకు దిగారు.  రుయా ఆసుపత్రి వద్ద శిల్ప కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. 

ఈ ఘటనను ఏపీ సర్కార్ తీవ్రంగా తీసుకొంది.  ఈ ఘటనపై  సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ బుధవారం నాడు విచారణ చేపట్టనుంది.ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. 

ఈ వార్తలు చదవండి: డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

                                      డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

                                          డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

                                         షాక్: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios