విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి కలకలం రేపుతోంది. ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది...దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు అన్న అంశాలపై విశాఖ పోలీసులు దృష్టి సారించారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం నుంచి ఎయిర్ పోర్ట్ అవుట్ లెట్ లో ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అందులో శ్రీనివాసరావు చెఫ్ గా పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితమే శ్రీనివాసరావు చెఫ్ గా చేరాడు. 

శ్రీనివాసరావు పూర్తి పేరు జనిపల్లి శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అయితే కోడిపందాలు నిర్వహించే కత్తి ఎందుకు వచ్చింది...ఎందుకు దాడి చేశాడు...అంత సెక్యూరిటీని తప్పించుకుని ఎలా వెళ్లాడు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

జగన్ పై దాడి చెయ్యాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెస్టారెంట్ లో లభించే పదార్థాలు చాకు ఎందుకు వచ్చింది హోటల్ లో అటువంటివి వినియోగిస్తారా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

అయితే అటువంటి కత్తులు రెస్టారెంట్ లో వినియోగించని నేపథ్యంలో మరి శ్రీనివాసరావు ఎలా తీసుకువచ్చాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే భారీ సెక్యూరిటీల కళ్లుగప్పి శ్రీనివాసరావు కత్తిని ఎలా తీసుకెళ్లాడు అన్న దానిపై సందేహంగా మారింది. జగన్ శుక్రవారం వస్తారని ముందుగానే ఊహించి శ్రీనివాస్ పథకం ప్రకారం కత్తి తీసుకువచ్చాడా అన్న సందేహం  కూడా నెలకొంది.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి చేసింది ఇతడే...

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

జగన్ పై దాడి: ఎపి డీజీపికి గవర్నర్ ఫోన్ చేసి ఆరా