అమరావతి: మూడో రోజున  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  గందరగోళం చోటుచేసుకొంది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు పోటీగా వైసీపీ సభ్యులు కూడ  నినాదాలు చేశారు. ఈ సమయంలో సభలో గందరగోళం చోటు చేసుకొంది. 

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

ఏపీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొన్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. ఈ సమయంలో సీఎం జగన్ ప్రసంగించారు.

టీడీపీ సభ్యులు కనీసం పట్టుమని పదిమంది సభ్యులు కూడ లేరని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమ వైపున 151 మంది సభ్యులు ఉన్నారన్నారు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి  రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.స్పీకర్ పోడియం వద్ద రింగ్ దాటి వచ్చిన  ఎమ్మెల్యేలను మార్షల్స్‌ను ఏర్పాటు చేసి బయటకు పంపాలని  సీఎం జగన్ కోరారు.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

టీడీపీ ఎమ్మెల్యేలు  రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యులపై దాడి చేస్తే మీడియాలో  తమకు అనుకూలంగా  ప్రచారం చేసుకొనేలా టీడీపీ  ప్రయత్నాలు చేస్తోందని సీఎం జగన్ ఆరోపించారు.టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని  సీఎం జగన్ విమర్శించారు. చేతకాకపోతే సభ బయట ఉండాలని సీఎం జగన్ టీడీపీ సభ్యులన ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

పది మంది ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ను అగౌరవపర్చే విధంగా  వ్యవహరిస్తున్నారన్నారు.

సీఎం ప్రసంగించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. మూడు రోజులుగా టీడీపీ సభ్యులు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయన్నారు.

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

అప్పటికీ కూడ స్పీకర్ పోడియంపైనే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సమయంలో స్పీకర్ మార్షల్స్ ను పిలిపించారు. మార్షల్స్ టీడీపీ ఎమ్మెల్యేలను  వారి వారి స్థానాల్లో కూర్చోబెట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం  టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ఇది సభ... మీ ఇల్లు కాదు అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.