అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచామన్న గర్వంతో కాదని వినమ్రంగా చెప్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మూడు వారాలలోపే ముందే మూడింట రెండు వంతులు ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వైయస్ఆర్ పార్టీకి, తమ ప్రభుత్వానికి ఒక్క ఓటు కూడా వేయని ప్రజలు కూడా ఇక నిండు మనస్సుతో తమను దీవించాలని కోరారు వైయస్ జగన్. 

సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాలనలో అందర్నీ భాగస్వామ్యం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంచి చూడగా మనుసులందున మంచి చెడు రెండే కులములు మహాకవి శ్రీశ్రీ చెప్పిన వ్యాఖ్యాలను గుర్తు చేశారు. 

మంచిని పెంచుతూ చెడును అంతమెుందించాలన్నదే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా ఎంతటి వారైనా సహించేది ఉండదని తేల్చి చెప్పారు.   

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికల వరకే పార్టీలు,గెలిచిన తర్వాత అంతా నావారే : వైయస్ జగన్

అది మన ఖర్మ, అయినా వారి మనసు కరిగే వరకు పోరాడుతా: సీఎం వైయస్ జగన్

ప్రత్యేక హోదా ఏ పాపం చేసింది చంద్రబాబూ!: సీఎం వైయస్ జగన్

29 సార్లు ఢిల్లీకి చంద్రబాబు... పడిపడి నవ్విన జగన్