Asianet News TeluguAsianet News Telugu

ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు మేం వ్యతిరేకం: అసెంబ్లీలో జగన్ సర్కార్ తీర్మానం

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్‌సీ), ఎన్‌‌పీఆర్‌కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అదే విధంగా ఆ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది.

AP Assembly Passes Resolution On NRC and NPR
Author
Amaravathi, First Published Jun 17, 2020, 5:45 PM IST

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్‌సీ), ఎన్‌‌పీఆర్‌కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అదే విధంగా ఆ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది.

భోజన విరామం తర్వాత శాసనస సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్‌పీఆర్-2020 (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్టర్)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయని డిప్యూటీ సీఎం అన్నారు.

Also Read:ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ తీర్మానం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

అందువల్ల 2010 నాటి ఫార్మాట్ ప్రకారమే ఎన్‌పీఆర్ అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఎన్‌పీఆర్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు.

మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్ భాషా ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎన్ఆర్‌సీని అమలు చేయబోమని గతంలో సీఎం వైఎస్ జగన్ అన్నారని ఆయన ప్రస్తావించారు. గతంలో 2010, 2015లో ఎన్‌పీఆర్ నిర్వహించారని అంజాద్ భాషా గుర్తుచేశారు.

Also Read:ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లపై టీడీపీ వైఖరి ఇదే: చంద్రబాబు ప్రకటన

అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మాట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంజాద్‌బాషా వ్యాఖ్యానించారు.

అందుకే మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దాని ఆధారంగానే ఇప్పుడు శాసనసభలో మరో తీర్మానం ప్రవేశ పెడుతున్నామని అంజాద్ భాషా చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios