ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లపై టీడీపీ వైఖరి ఇదే: చంద్రబాబు ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నార్సీపై డిల్లీలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్నాారని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అయితే టిడిపి మాత్రం అక్కడా, ఇక్కడా ఒకే స్టాండ్ పై వుందన్నారు.  

tdp supports NRC, NPR : nara chandrababu  naidu

తెలుగుదేశం పార్టీ అంటేనే సెక్యులర్‌ విధానాలకు కట్టుబడే పార్టీ అని ఆ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు  వెల్లడించారు.  అన్ని కులాలు, మతాల హక్కుల పరిరక్షణ, సామరస్యం కోసం కృషి చేస్తున్న పార్టీ  తమదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పట్ల దేశ వ్యాప్తంగా అభద్రతా భావం వ్యాపించిందని... తెలుగుదేశం పార్టీ  నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ (ఎన్‌పీఆర్‌), నేషనల్‌ రిజిష్టర్‌ ఆప్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్సీ)లను వ్యతిరేకిస్తుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లీంలందరికి టిడిపి అండగా ఉండి మద్ధతు తెలుపుతుందన్నారు.  

సోమవారం తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో 13 జిల్లాల మైనార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ...లౌకికవాదానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. అన్ని వేళలా మైనార్టీ సోదరులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. 

22 మంది వైసీపీ ఎంపీలకు విప్‌లు జారీ చేసి పార్లమెంట్‌లో మద్దతు తెలియజేసి రాష్ట్రంలో ఆగమేఘాలమీద గెజిట్‌తో పాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్‌ఆర్సీకి వ్యతిరేకమంటూ జగన్ మైనార్టీలను మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు. మైనార్టీలు అధికంగా ఉన్న అమరావతిలో రాజధాని నిర్మిస్తుంటే జగన్‌ అడుగడుగునా అడ్డుపడుతున్నారని... వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రంలోని మైనార్టీలు ఉపాధి కోల్పోతున్నారని  అన్నారు.

read more  సుజనాకు జివిఎల్ షాక్...ఏపి రాజధానిపై కీలక వ్యాఖ్యలు

ఇసుక కొరత, వివిధ ప్రాజెక్టుల పనులు నిలిపివేయటం, పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతుండటంతో మైనార్టీ యువత ఉపాధి కోల్పోతున్నారని మైనార్టీ నాయకులు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ...ముస్లీంల సంక్షేమానికి, మెరుగైన జీవనానికి టీడీపీ తోడ్పాటును అందిస్తే  మైనార్టీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. 

దేశంలో మొట్టమెదటిసారిగా మైనార్టీల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్‌ ఏర్పాటు, హజ్‌ హౌస్‌ల నిర్మాణం, హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం, ఇమాం, మౌజన్‌లకు గౌరవ వేతనాలు, రంజాన్‌ తోఫా, దుల్హన్‌ పథకం వంటి వాటితో పాటు ముస్లీం విద్యార్ధులకు అనేక రకాలుగా చేయూతను అందించామని చంద్రబాబు   తెలిపారు.

 హిదాయత్‌ మాట్లాడుతూ.. '' ఎన్‌ పిఆర్‌ పై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది వైసిపి ప్రభుత్వమే..ఒకవైపు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, మరోవైపు ఎన్‌ పిఆర్‌ కు వ్యతిరేకమని జగన్నాటకం ఆడారు.  జగన్మోహన్‌ రెడ్డిది ఎప్పుడు కూడా మోసమే..అప్పుడు ఇప్పుడు ముస్లింల సంక్షేమానికి అభ్యున్నతికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు.

గతంలో గుజరాత్‌ లో గోద్రా సంఘటన జరిగినప్పుడు, మొన్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు విషయంలో ఎన్డీఏలో ఉండికూడ విబేధించి స్టాండింగ్‌ కమిటీకి పంపేలా చేసింది తెలుగుదేశం పార్టీయే. ఎన్‌ పిఆర్‌ కు వ్యతిరేకంగా టిడిపి ఎంపి కేశినేని నాని లోక్‌ సభలో ఓటేశారని'' గుర్తుచేశారు. 

read more  హరీశ్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలే జగన్‌ పనితీరుకు నిదర్శనం: బోండా ఉమ

చాంద్‌ బాషా మాట్లాడుతూ ...'' ఈ 7నెలల్లో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదు, అన్నిపనులు నిలిపేశారు. టిడిపి ప్రభుత్వం 11లక్షల ముస్లిం కుటుంబాలకు అందజేసిన రంజాన్‌ తోఫాను జగన్మోహన్‌ రెడ్డి నిలిపేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్సీ మీద ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రానున్న సమావేశాల్లో నిలదీయాలి.

ముస్లింలను మోసగించడం జగన్‌ విధానం అయితే ముస్లింల సంక్షేమం టిడిపి విధానం. దీనిని ముస్లిం సమాజంలోకి బలంగా తీసుకెళ్ళాలని కోరారు. ఈ సమావేశంలో నాగుల్‌  మీరా, మాజీ ఎమ్మెల్యేలు చాంద్‌ బాషా, జలీల్‌ ఖాన్‌, అమీర్‌ బాబు, పర్వీన్‌ తాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios