ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితమవుతూ ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్‌లో తీర్మానం ఆమోదించినట్లుగా మంత్రి వెల్లడించారు. మార్పులు చేసే వరకు రాష్ట్రంలో ప్రక్రియ నిలిపివేయాలని తీర్మానం చేశామన్నారు.

Also Read:ప్రారంభమైన ఏపీ కేబినెట్: 27 నుండి అసెంబ్లీ సమావేశాలు

ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 26,976 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు.

పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేశామని నాని తెలిపారు. ఇళ్లపట్టాలను ప్రభుత్వమే రిజస్టర్ చేయించి లబ్ధిదారులకు ఇస్తుందని, బ్యాంక్‌లో ఇళ్ల పట్టాలు తనఖా పెట్టి వ్యక్తిగత అసవరాలకు లోన్‌ తీసుకోవచ్చునని పేర్నినాని చెప్పారు.

Also Read:ముస్లింలతో భేటీ ఎఫెక్ట్: ఎన్‌పీఆర్‌పై వెనక్కితగ్గిన జగన్మోహన్ రెడ్డి

ఈ ప్రక్రియను మరింత సులభతరం చెయ్యడం కోసం రాష్ట్రంలోని తహసీల్దార్‌లను జాయింట్ రిజస్టర్‌లుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనుల్లో జీఎంఆర్‌కు ఇచ్చిన 2,700 ఎకరాలను 2,500కు కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.