కుప్పంలోనే బాబుకు భువనేశ్వరి బైబై : ఒంగోలు సభలో జగన్ సెటైర్లు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఒంగోలు: కుప్పానికి వెళ్లి బైబై బాబు అని నారా భువనేశ్వరి అంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.శుక్రవారం నాడు ఒంగోలులో నిర్వహించిన 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, తాగునీటి పథకానికి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మాత్రం ఆయన సిద్దంగా లేరని అంటున్నారన్నారు. భువనేశ్వరి కుప్పం వెళ్లి బైబై బాబు అంటున్నారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్ధిస్తున్నారని జగన్ చెప్పారు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమి: షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ
14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడికి చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.తనను సవాల్ చేయడం కాదు... తాను సీఎంగా ఉన్న కాలంలో చేసిన మంచి పని ఏమిటో చెప్పాలని చంద్రబాబును కోరారు వై.ఎస్. జగన్.
రాక్షసుల దుర్మార్గం కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని జగన్ చెప్పారు.వందమంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు చేసిన దుర్మార్గమే ఎక్కువ అని జగన్ విమర్శించారు.ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడ భయం బెరుకు లేకుండా చంద్రబాబు ఉన్నారన్నారు.
also read:గాంధీలో పూర్తైన పోస్టుమార్టం: తండ్రి సమాధి పక్కనే లాస్య నందిత అంత్యక్రియలు
ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఎస్సీలను చంద్రబాబు అవమానించారని జగన్ చెప్పారు.తోకలను కత్తిరిస్తానంటూ బీసీలను కూడ చంద్రబాబు అవమానించారన్నారు.రుణమాఫీ చేస్తానని రైతులను కూడ చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. దొంగ హామీలతో మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడన్నారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
also read:అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి
చంద్రబాబును కుప్పం ప్రజలు కూడ నమ్మడం లేదన్నారు. తాను ప్రజలను నమ్ముకుంటుంటే చంద్రబాబు దళారులను నమ్ముకుంటున్నాడని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడ్డు తలిగేలా చంద్రబాబు 1100 వందలకు పైగా కేసులు వేయించారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో పేదలకు, బలహీనవర్గాలకు నామినేటేడ్ పదవులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.