గాంధీలో పూర్తైన పోస్టుమార్టం: తండ్రి సమాధి పక్కనే లాస్య నందిత అంత్యక్రియలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవదేహన్ని స్వగృహనికి తరలించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గత ఏడాది లాస్య నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు.సాయన్న సమాధి వద్దే లాస్య నందిత అంత్యక్రియలను నిర్వహించనున్నారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు.
also read:రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి: అతి వేగమే కారణమా?
పోస్టుమార్టం పూర్తైన తర్వాత లాస్యనందిత మృతదేహన్ని ఆమె స్వగృహనికి తరలించారు. లాస్య నందిత మృతదేహనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
also read:అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి
2023 ఫిబ్రవరి మాసంలో అనారోగ్యంతో లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందారు. గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి లాస్య నందిత భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తండ్రి ప్రోత్సహంతో లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ తరపున ఆమె కార్పోరేటర్ గా విజయం సాధించారు. తండ్రి మరణంతో లాస్య నందితకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన మూడు మాసాలకే లాస్య నందిత మృతి చెందారు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమి: షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ
ఈ నెల 13న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత సురక్షితంగా బయటపడ్డారు. పది రోజుల తర్వాత ఇవాళ జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.గాంధీ ఆసుపత్రి వద్ద లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.