అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాడా, పార్టీ మారుతారా అనే విషయంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అమంచి కృష్ణమోహన్ స్పష్టం చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత కూడా ఆయన ఆయన ఏ విషయమూ తేల్చలేదు. 

చంద్రబాబు తాను చెప్పిన విషయాలను సానుకూలంగా విన్నారని కృష్ణమోహన్ భేటీ తర్వాత మీడియాతో అన్నారు. తన అనుచరులతో, సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని అన్నారు .

మొదట్లో తాను టీడీపితో ఘర్షణ పడ్డానని, ఆ తర్వాత టీడీపిలో చేరానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్దపడ్డారనే వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఆయనతో తొలుత మంత్రి శిద్ధా రాఘవరావు చర్చలు జరిపారు. ఆయన తర్వాత ఆమంచి చంద్రబాబును కలిసారు. తన నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలపై ఆయన చంద్రబాబుకు వివరించారు. 

సంబంధిత వార్తలు

పార్టీ మార్పు పుకార్లు:చంద్రబాబుతో ఆమంచి భేటీ

శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు