అమరావతి:  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  గురువారం నాడు  ఉదయం  అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  బాబుతో భేటీకి  ప్రాధాన్యత నెలకొంది.

ఏపీ సీఎం చంద్రబాబుతో  బుధవారం నాడు మధ్యాహ్నం భేటీ కావాల్సిన  ఆమంచి కృష్ణమోహన్ ఇంతవరకు భేటీ కాలేదు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో  భేటీ అయ్యారు.

గురువారం ఉదయం తొలుత మంత్రి శిద్దా రాఘవరావుతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు.  మంత్రితో కలిసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాబుతో సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి వద్దకు మంత్రి శిద్దా రాఘవరావు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను తీసుకెళ్లారు. బాబుతో భేటీ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు