చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి మంగళవారం సాయంత్రం మంత్రి శిద్దా రాఘవరావు చేరుకొన్నారు. టీడీపీలోనే కొనసాగాలని మంత్రి ఆమంచిని కొనసాగాలని కోరారు.

ఇవాళ ఉదయం నుండి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ మారే విషయమై ఆయన అనుచరులతో చర్చించారు.
టీడీపీని వీడి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి శిద్దా రాఘవరావు  సాయంత్రం ఆమంచి ఇంటికి చేరుకొన్నారు. ఆమంచితో భేటీ అయ్యారు. టీడీపీలోనే కొనసాగాలని శిద్దా రాఘవరావు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ‌ను కోరారు.
 

సంబంధిత వార్తలు

ప్రకాశంలో చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి ఆమంచి..?