
మా ఇంటికిరా చంద్రన్నా.. CM ముందు గిరిజనమహిళ భావోద్వేగం
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం గుండ్లసముద్రం ST కాలనీలో అభివృద్ధి కథ హృదయాలను కదిలిస్తోంది. TVS ట్రస్ట్ సహాయంతో గ్రామం ఎలా మారిపోయిందో స్థానిక మహిళ పంజా సుబ్బమ్మ భావోద్వేగంగా వివరించారు.కాల్వ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి వారధి నిర్మాణం, మంచి నీటి సమస్య నుంచి వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఆరోగ్య సమస్యల నుంచి వైద్య పరీక్షలు, ఇళ్ల నిర్మాణం వరకు గ్రామంలో వచ్చిన మార్పులు ప్రజల జీవితాలను మార్చేశాయి.ఈ సందర్భంగా “చంద్రన్నా మా ఊరికి రాన్నా…” అంటూ మహిళ చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu “తప్పకుండా వస్తా” అని హామీ ఇచ్చారు.
Add Asianetnews Telugu as a Preferred Source
