నిద్రిస్తున్న దంపతులను నరికి చంపేసి, కూతురును హతమార్చేందుకు యత్నం.. రాళ్లతో కొట్టి ప్రాణం తీసిన స్థానికులు
ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి మండలంలోని ఓ గ్రామంలో ఓ దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న భార్యాభర్తలు ఘోరంగా హతమార్చాడు. అనంతరం వారి కూతురును కూడా చంపేందుకు ప్రయత్నించడంతో స్థానికులు నిద్రలో నుంచి లేచి దుండుగుడిని పట్టుకున్నారు.
నిద్రిస్తున్న దంపతులపై ఓ దుండుగుడు దారుణానికి ఒడిగట్టాడు. వారిద్దరిని దారుణంగా చంపేశాడు. అనంతరం వారి కూతురును కూడా హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది.
కొంత మంది దోషులు ఇతరుల కంటే ప్రత్యేకం - బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు
‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు, తమ కూతురుతో కలిసి ఎప్పటిలాగే ఇంటి ఎదుట శుక్రవారం రాత్రి నిద్రపోతున్నారు. అయితే అకస్మాత్తుగా వారి వద్దకు ఓ దుండగుడు వచ్చాడు. దంపతులిద్దరినీ నరికి చంపాడు. అనంతరం పక్కన నిద్రపోతున్న బాలికను కూడా హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు.
రామచరితమానస్ లో పొటాషియం సైనైడ్ ఉంది - బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ
అయితే బాలిక అతడిని గమనించింది. ఏం జరుగుతుందో అర్థం కాక.. అతడి బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు నిద్రలో నుంచి లేచి, బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటివైపు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు.