విజయనగరంలో దారుణం...పెళ్లీడు కూతురితో సహా బావిలో శవాలై తేలిన భార్యాభర్తలు (వీడియో)
వ్యవసాయ బావిలో ఓ కుటుంబం మొత్తం శవాాలుగాా తేలిన విషాద ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది.

విజయనగరం : ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేక మరేదైనా దారుణం జరిగిందో తెలీదు... బావిలో ఓ కుటుంబం మొత్తం శవమై తేలింది. పెళ్ళీడుకు వచ్చిన కూతురితో కలిసి దంపతులు మృతిచెందారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. ఏమయ్యిందో తెలీదుగానీ కుటుంబంతో సహా మహముద్దీన్ వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు. భార్య షరీష నిషా(39), కూతురు ఫాతిమా జహార(18)తో పాటు మహముద్దీన్ మృతదేహాలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులో బయటపడ్డాయి.
వీడియో
వ్యవసాయ పొలాల మధ్యలోని ఓ బావిలో మృతదేహాలను గుర్తించిన చింతలపాలెం రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిపై తేలుతున్న మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read More రైలు, ప్లాట్ ఫామ్ కు మధ్యన ఇరుకున్న మిత్రుడి భార్యను కాపాడబోయి.. స్నేహితుడు మృతి
చనిపోయింది మహముద్దీన్ కుటుంబంగా గుర్తించిన పోలీసులు బందువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహముద్దీన్ కుటుంబానిది హత్యా లేక ఆత్మహత్యా అన్నది తెలియాల్సి వుంది.