అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మరణం.. మరో ముగ్గురికి గాయాలు
విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు
వారంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు. సరదాగా విహార యాత్రకు వెళ్లారు. రెండు కార్లలో 10 మంది విద్యార్థులు కలిసి పర్యాటక ప్రదేశానికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి చీకటి పడింది. ఈ క్రమంలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించాకు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
అమిత్ షా వర్సెస్ స్టాలిన్.. ‘హిందీ భాషకు మేం బానిసం కాబోం’
ఏలూరు దగ్గరలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు విహారయాత్రకు వెళ్లాలని భావించారు. అయితే ఇందులో థర్డ్ ఇయర్ చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో మారేడుమిల్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి వెంట ఓ డ్రైవర్ ను కూడా వెంటబెట్టుకొని శనివారం వెళ్లారు.
TSRTC: ఆర్టీసీ కార్మికుల ఆశలకు అడ్డుపడాలని లేదు, కానీ..: గవర్నర్ తమిళిసై
మారేడుమిల్లిలో పర్యాటకాన్ని ఆస్వాదించిన తరువాత ఈ విద్యార్థులంతా తిరిగు ప్రయాణం ప్రారంభించారు. వీరి వాహనాలు బూరుగుపూడి దగ్గరకు వచ్చే సరికి అర్ధరాత్రి దాటింది. ఈ రెండు కార్లలో ఓ కారు పాత, కొత్త బ్రిడ్జిల మధ్యలో కాలువలోకి దూసుకొని వెళ్లింది. ఈ కారులో మొత్తంగా ఆరుగురు ఉన్నారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ! నేనే ఆహ్వానించా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారును వెలికి తీయడంతో అందులోని ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఒకరిని ఉదయ్ గా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు గాయాలతో బతికిబయటపడ్డారు. క
అత్తాపూర్ లో విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన.. దేహశుద్దిచేసిన తల్లిదండ్రులు, అరెస్టు
గాయపడిన వారిని రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే చీకటి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం మళ్లీ మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతామని పోలీసులు అధికారులు వెల్లడించారు.
కారు ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఇదే కారుపై తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓవర్ స్పీడ్ కు చెందిన చలాన్లు ఉన్నాయి.