అత్తాపూర్ లో విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన.. దేహశుద్దిచేసిన తల్లిదండ్రులు, అరెస్టు
Hyderabad: ఇటీవలి కాలంలో స్కూళ్లల్లో విద్యార్థినిలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతుండటంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ లో ఉన్న ఒక పాఠశాలలో పీఈటీ ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
PET misbehaves with a student: స్కూళ్లలో విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో స్కూళ్లల్లో విద్యార్థినిలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతుండటంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ లో ఉన్న ఒక పాఠశాలలో పీఈటీ ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పీఈటీకి దేహశుద్ది చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పీఈటీని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో ఉన్న ఎస్‌ఆర్ డిజి స్కూల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని పై అక్కడి ఒక టీచర్ లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్ పీఈటీ విష్ణు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే, విద్యార్థినికి పలుమార్లు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేస్తూ మాట్లాడాడు. విద్యార్థిని ఈ విషయాలను ఎవరికీ చెప్పకపోవడంతో.. నిందితుడి మరింతగా రెచ్చిపోతూ వేధించాడం మొదలుపెట్టాడు. పీఈటీ ఆగడాలు పెరగడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం ఈ విషయం తెలిసి.. స్కూల్ వద్దకు చేరుకున్నారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న పీఈటీ విష్ణుకు దేహశుద్ద చేశారు. పాఠశాల యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ.. స్కూల్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కేసు నమోదుచేసుకున్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.