video News: ఉల్లి కోసం కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం

Nov 24, 2019, 9:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు ప్రజల కళ్లలో నీరు తెప్పిస్తున్నాయి. బయట మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే విక్రయించడంతో గంటలకొద్దీ నిలబడి కొనుగోలు చేశారు. ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండడంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది.

రైతు బజార్లలో ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. వాటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లోని రైతు బజార్లకు పంపిస్తోంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను మాత్రమే ఇస్తున్నారు.