సూప‌ర్ సెంచ‌రీతో రికార్డుల మోత మోగించిన విరాట్ కోహ్లీ

First Published | Nov 24, 2024, 4:04 PM IST

Virat Kohli : భారత్ vs ఆస్ట్రేలియా 1వ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భార‌త అద్భుత‌మైన బ్యాటింగ్ తో ప‌రుగుల వ‌ర‌ద‌పారిస్తోంది. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లి తన 30వ టెస్ట్ సెంచరీని సాధించాడు. దీంతో త‌న ఫామ్ ఆందోళ‌న‌ల‌కు తెర‌దించాడు.
 

Virat Kohli : పెర్త్‌లో జరిగిన భారత్ - ఆస్ట్రేలియా 1వ టెస్టు మ్యాచ్‌లో వెటరన్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన 30వ అంతర్జాతీయ టెస్టు సెంచరీని సాధించి త‌న‌దైన‌ స్టైల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వ‌రుస‌గా విఫ‌లం కావ‌డంతో 2024లో భారత జట్టులో కోహ్లి పాత్రపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌న బ్యాట్ తోనే విరాట్ కోహ్లీ స‌మాధానం ఇచ్చాడు. 

Virat Kohli

విరాట్ కోహ్లీ 81వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చాలా కాలం త‌ర్వాత ఫామ్ లోకి వ‌స్తూ ఎట్టకేలకు తన 81వ అంతర్జాతీయ సెంచరీని సాధించి అభిమానుల ఆందోళ‌న‌కు ముగింపు పలికాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సూప‌ర్ బ్యాటింగ్ తో సెంచ‌రీ సాధించాడు.

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న భార‌త్ తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు విరాట్ కోహ్లీ 143 బంతుల్లో 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 69.93 స్ట్రైక్ రేట్‌తో త‌న ఇన్నింగ్స్ ను కొన‌సాగించాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 


Virat Kohli

81 అంతర్జాతీయ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును అందుకోవ‌డానికి విరాట్ కోహ్లీ మ‌రో సెంచ‌రీతో ముందుకు సాగాడు.  ఇప్పుడు విరాట్ కోహ్లి 81వ సెంచ‌రీని బాదాడు. క్రికెట్ హిస్ట‌రీలో భార‌త లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అత్య‌ధిక సెంచ‌రీల‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 100 సెంచరీలు చేసిన ఏకైక‌ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్. 

స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రెండో ప్లేయ‌ర్ ర‌న్ మిష‌న్ విరాట్ కోమ్లీ. కింగ్ కోహ్లీ ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. కోహ్లీ త‌ర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయ‌ర్లు

1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 100 సెంచరీలు

2. విరాట్ కోహ్లీ (భారత్) - 81 సెంచరీలు

3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 71 సెంచరీలు

4. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 63 సెంచరీలు

5. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 62 సెంచరీలు

Virat Kohli

టెస్టు క్రికెట్‌లో 30వ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ 

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో 30వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ 30 సెంచరీలతో వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చంద్రపాల్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ రికార్డులను సమం చేశాడు. శివ నారాయణ్ చందర్‌పాల్, మాథ్యూ హేడెన్‌లు టెస్ట్ క్రికెట్‌లో 30 సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నారు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు

1. సచిన్ టెండూల్కర్ (భారతదేశం) - 51 సెంచరీలు

2. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 45 సెంచరీలు

3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 41 సెంచరీలు

4. కుమార్ సంగక్కర (శ్రీలంక) – 38 సెంచరీలు

5. రాహుల్ ద్రవిడ్ (భారత్) - 36 సెంచరీలు

16. విరాట్ కోహ్లీ (భారత్) - 30 సెంచరీలు

Latest Videos

click me!