ఆ ఇద్దరు హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్, అయినా విడిపోయారు..ఇండస్ట్రీలో ఇగో గురించి రానా, నాని కామెంట్స్ 

First Published | Nov 24, 2024, 4:42 PM IST

బాహుబలి తర్వాత రానా సినిమాలు బాగా తగ్గించారు. రానా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ టాక్ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో టాక్ షో ప్రారంభం అయింది.

బాహుబలి తర్వాత రానా సినిమాలు బాగా తగ్గించారు. రానా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ టాక్ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో టాక్ షో ప్రారంభం అయింది. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా నేచురల్ గా ఉండేలా ఈ షోని ప్లాన్ చేశారు. తొలి ఎపిసోడ్ రీసెంట్ గా స్ట్రీమింగ్ మొదలైంది. 

తొలి షోకి నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, తేజ సజ్జా అతిథులుగా హాజరయ్యారు. చాలా కూల్ గా రానా వీరి ముగ్గురితో మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న విశేషాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి వీరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల మధ్య ఇగోల గురించి రానా, నాని మాట్లాడుకున్నారు. 


రానా మాట్లాడుతూ గతంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న హీరోలు ఇద్దరు కేవలం సిల్లీగా ఇగో ఫీలింగ్స్ వల్ల విడిపోయారు. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం కూడా లేదు కేవలం ఇగో వల్లే విడిపోయారు అని రానా అన్నాడు. అయితే ఆ ఇద్దరు హీరోల పేర్లు చెప్పలేదు. హీరోల మధ్య ఇగోలు ఉన్నాయనే విషయాన్ని నాని కూడా అంగీకరించాడు. ఒక క్లాస్ రూమ్ లో కొన్నేళ్లు చదువుకునే విద్యార్థుల మధ్య చాలా బలమైన బాండింగ్ ఉంటుంది. 

అలాంటిది 30 ఏళ్లపాటు ఇదే ఇండస్ట్రీలో ఉండాలని వస్తాం.. మన మధ్య ఇంకెత బాడింగ్ ఉండాలి అని నాని ప్రశ్నించారు. 80, 90 దశకం నాటి హీరోలు బాగా కలసిపోతున్నారు అని నాని అన్నారు. రానా మాట్లాడుతూ.. మా తాతగారు రామానాయుడు బయట వ్యక్తుల కంటే ఇండస్ట్రీ వాళ్ళతోనే ఎక్కువగా కలసిపోయేవారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తే వెంటనే వాళ్ళతో మాట్లాడేవారు. 

Rana Dagubbati

వారితో గతంలో చిన్న చిన్న గొడవలు విభేదాలు ఉన్నా పట్టించుకునేవారు కాదు. మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళతోనే స్నేహం చేయాలి. విభేదాలు వస్తే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కలసి పోవాలి అని తాతగారు చెప్పారు అంటూ రానా గుర్తు చేసుకున్నాడు. మా జనరేషన్ హీరోల్లో ఇగో ఇంకా ఎక్కువైంది అని తేజ సజ్జా తన అభిప్రాయం తెలిపాడు. 

Latest Videos

click me!