కంగువ OTT విడుదల: సూర్య, బాబీ డియోల్ చిత్రం ఎక్కడ, ఎప్పుడు చూడాలి?

First Published | Nov 24, 2024, 3:23 PM IST

సిరుతై శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో OTT స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుందట.

కంగువ

2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ఒకటైన కంగువ, సిరుతై శివ దర్శకత్వం వహించగా, సూర్య నటించారు. రెండేళ్ల కఠోర శ్రమ తర్వాత నవంబర్ 14న విడుదలైంది. కోలీవుడ్  మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా పేర్కొన్న కంగువ, 1000 కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి కోలీవుడ్ చిత్రంగా నిలుస్తుందనే అంచనాలతో విడుదలైంది. అయితే, ఈ అంచనాలు విడుదలైన మొదటి రోజే నీరుగారిపోయాయి.

కంగువలో సూర్య

అంచనాల నడుమ విడుదలైన కంగువ, దాని  పట్టులేని స్క్రీన్‌ప్లే కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మూవీ బీజీఎమ్ పై పిర్యాదులు వెల్లువెత్తాయి. చెవులు చిల్లులు పడేలా సౌండ్స్ ఉన్నాయంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. కంగువ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైంది.


కంగువ సినిమా

ఈ చిత్రం 'అగ్నిలా ఉంటుంది' అని సూర్య పేర్కొన్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో అడుగు ముందుకేసి 2000 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. ఆడియో లాంచ్ వేడుకలో, అలాగే  నెహ్రూ స్టేడియంలో డిసెంబర్‌లో జరిగే కంగువ విజయోత్సవ వేడుకకు హాజరు కావాలని, ముందే చెప్పారు. ఈ హైప్‌కు లోనైన అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందిన ప్రేక్షకులు భారీగా ట్రోలింగ్ చేశారు.

కంగువ OTT విడుదల

సుమారు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కంగువ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, తర్వాతి రోజుల్లో కలెక్షన్లు భారీగా పడిపోవడంతో వారంలోనే చాలా థియేటర్ల నుండి తొలగించారు. ఇటీవల విడుదలైన నిరైన్గల్ మూన్రు మంచి ఆదరణ పొందుతోంది  అనేక థియేటర్లలో కంగువా తీసేసి ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. 

కంగువ OTT విడుదల అప్‌డేట్

థియేట్రికల్ రన్ ముగియడంతో, కంగువా ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమైంది. హిందీ వెర్షన్ మినహా, డిసెంబర్ రెండవ వారంలో OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది. హిందీ వెర్షన్ జనవరిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ 100 కోట్లకు OTT హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Latest Videos

click me!