స్టన్నింగ్ లుక్‌తో Royal Enfield గోవాన్ క్లాసిక్ 350 మార్కెట్‌లోకి వచ్చేసింది

First Published | Nov 24, 2024, 3:42 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే రాయల్ లుక్ తో ఉంటుంది కదా.. ఇప్పుడు ఈ బుల్లెట్ కి స్టన్నింగ్ లుక్ ని కూడా యాడ్ అయ్యింది. గోవాన్ క్లాసిక్ 350 పేరుతో లాంచ్ అయిన ఈ మోటార్ సైకిల్ ను మీరు చూస్తే చూపు తిప్పుకోలేరు. కలర్ కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా శుభ వార్తే. ఇప్పటి వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అనేక మోడల్స్ వచ్చాయి కదా.. కాని ఇప్పుడు రిలీజ్ అయిన గోవాన్ క్లాసిక్ 350 వేరే లెవెల్ అంతే. ఇది ఇప్పటికే ఫేమస్ అయిన క్లాసిక్ 350 బైక్ ఆధారంగా తయారైన బైక్. దాన్ని అప్ డేట్ చేస్తూ అత్యాధునిక సౌకర్యాలను యాడ్ చేసి గోవాన్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చారు. అనేక అప్‌డేట్‌లతో వస్తున్న ఈ బైక్ గోవాలో జరిగిన మోటోవర్స్ 2024 ఈవెంట్‌లో ఇటీవలే ఆవిష్కరించారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ సింగిల్ టోన్ వేరియంట్ ధర రూ.2.35 లక్షలు. డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ.2.38 లక్షలుగా నిర్ణయించారు. గోవాన్ క్లాసిక్ 350 మోడల్ రెట్రో లుక్‌ను కలిగి ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. కొత్త అప్‌డేట్‌లను కూడా కలిగి ఉండటంతో యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. హ్యాండిల్‌బార్, ఫుట్‌పెగ్స్, ఎగ్జాస్ట్ పైప్ వంటి కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం వల్ల గోవాన్ క్లాసిక్ 350కి స్టన్నింగ్ లుక్ వచ్చింది.  


రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 లో పెట్రోల్ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, సింగిల్ సీట్, స్వింగర్మ్ వంటివి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ట్యూబ్‌లెస్, వైట్‌వాల్ టైర్లతో వస్తుంది. క్లాసిక్ 350లో ఉన్న 349సిసి J-సిరీస్ ఇంజిన్‌నే ఈ మోడల్ కూడా కలిగి ఉంది. సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 bhp, 27 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌తో కలిపి ఉంది. దీన్ని బట్టి వేగాన్ని అంచనా వేయవచ్చు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 కి రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఈ బైక్‌లో ముందు చక్రం 19 అంగుళాలు, 16 అంగుళాల వెనుక చక్రం ఉన్నాయి. ఇది క్లాసిక్ 350 డిజైన్‌కు భిన్నంగా ఉంటుంది. గోవాన్ క్లాసిక్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిజిటల్ అనలాగ్ కన్సోల్‌, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. USB ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ 349cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పరుగులు పెడుతుంది. 20.2 bhp పవర్, 27 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. లాంగ్ డ్రైవ్ కు వెళ్లే వారికి ఈ బైక్ చాలా బాగుంటుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌కు 36.2 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గోవాన్ క్లాసిక్ 350 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో లభిస్తుంది.

Latest Videos

click me!