పూరి జగన్నాధ్, వివి వినాయక్ కూడా అదే సమయంలో దర్శకులుగా మారారు. పూరి జగన్నాధ్ ఓ ఏడాది ముందు 2000లో దర్శకుడు అయ్యాడు. ఇక వివి వినాయక్ ఆది చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆది 2002లో విడుదలైంది. రాజమౌళి, వివి వినాయక్ డెబ్యూ మూవీస్ లో ఎన్టీఆర్ హీరో కావడం విశేషం. రాజమౌళి, పూరి, వినాయక్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండేది.