ఐపీఎల్ హిస్ట‌రీలో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా శ్రేయాస్ అయ్య‌ర్ రికార్డు

First Published | Nov 24, 2024, 4:52 PM IST

most expensive player in IPL auction history : ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయాస్ అయ్య‌ర్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. కేకేఆర్ టీమ్ వేలానికి ముందు అత‌న్ని వ‌దులుకుంది. ఇప్పుడు వేలంలో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా శ్రేయాస్ అయ్య‌ర్ రికార్డు సృష్టించాడు.
 

Shreyas Iyer

most expensive player in IPL auction history : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఎడిష‌న్ కోసం ఆట‌గాళ్ల వేలం ప్రారంభం అయింది. ఏ ప్లేయ‌ర్లు ఏ జ‌ట్ల‌లోకి వ‌స్తార‌నే ఉత్కంఠ మ‌ధ్య ప‌లు జ‌ట్లు వేలానికి ముందు వ‌దులుకున్న ప్లేయ‌ర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇదే క్ర‌మంలో కోల్ క‌తా నైట్ రైట‌ర్స్ (కేకేఆర్) మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ కూడా కొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. 

టీమిండియా ఆట‌గాడు, ఐపీఎల్ 2024 లో కేకేఆర్ జ‌ట్టుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025 వేలంలో రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ.. ఐపీఎల్ వేలం చరిత్రలో అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ముందుగా ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డును బద్దలు కొడతాడని ఊహాగానాలు వచ్చాయి.. కానీ, అయ్యర్ మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. గత వేలంలో మిచెల్ స్టార్క్ ఈ రికార్డు సృష్టించాడు. స్టార్క్‌ని 24.75 కోట్లకు కేకేఆర్ జ‌ట్టు ద‌క్కించుకుంది. అదే త‌ర‌హాలో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ రికార్డు ధ‌ర‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Latest Videos


Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కోనుగోలు చేసి అతనిని జట్టులోకి తీసుకురావడానికి తమ శాయశక్తులా ప్రయత్నించింది.  కానీ, ఇందులో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 26 కోట్ల వరకు పంజాబ్‌తో ఢిల్లీ పోటీని కొనసాగించింది. అయితే చివర్లో పంజాబ్ జట్టు ఢిల్లీ ప్రణాళికలను చిత్తు చేసింది. 26.75 కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ జట్టులో చేర్చుకుంది. దీంతో ఐపీఎల్ హిస్ట‌రీలో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. 

ఛాంపియ‌న్ కెప్టెన్ శ్రేయాస్ ను వ‌దులుకున్న కేకేఆర్

గ‌త సీజ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) ఛాంపియ‌న్ గా నిలిచింది. ఇందులో కెప్టెన్ గా శ్రేయాస్ అయ్య‌ర్ చాలా పాత్ర‌నే పోషించాడు. కానీ, కోల్‌కతా జట్టు ఛాంపియన్ కెప్టెన్‌ను రిటైన్ చేసుకోకుండా విడుదల చేసింది. కేకేఆర్ వేలం ప్రారంభంలో అయ్యర్‌పై ఆసక్తి  కనబరిచింది. అయితే అతను ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన యుద్ధం నుంచి త‌ప్పుకుంది. అయితే, గతేడాది బ్యాట్‌తో అయ్యర్‌ ప్రత్యేక ప్రదర్శన ఏమీ చేయలేదు. కానీ, జ‌ట్టును విజ‌య‌వంతంగా ఛాంపియ‌న్ గా నిలిపాడు శ్రేయాస్ అయ్య‌ర్. 

click me!