రోడ్డుపై వెళ్లేవారిని భయభ్రాంతులకు గురిచేస్తూ... కరీంనగర్ లో యువకుడు హల్ చల్

Aug 1, 2021, 5:47 PM IST

కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ లో ఓ యువకుడు హల్ చల్ చేసాడు. రోడ్డు పక్కనే ఉన్న కుండలను పగలకొడుతూ రోడ్డుపైకి విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసాడు. ఇలా కాస్సేపు రోడ్డుపై గందరగోళం సృష్టించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కొద్ధిసేపు ఆ యువకుడు పోలీసులతో సైతం ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు అతన్ని తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించారు పోలీసులు.