కేసీఆర్ ఆరోగ్యంపై యశోదా వైద్యుల ప్రెస్‌మీట్.. సీఎం ఆరోగ్యంపై ఏం చెప్పారంటే..?

Mar 11, 2022, 4:03 PM IST

స్వల్ప అస్వస్థతతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యశోదా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు పలు పరీక్షలు చేశారు. అనంతరం యశోదా వైద్యులు మీడియాకు వివరాలు తెలియజేశారు. 

ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ కు స్వల్పంగా అస్వస్థత ఉందని సమాచారం రావడంతో డాక్టర్ MV Rao తో కలిసి తాను వెళ్లి పరీక్షలు నిర్వహించినట్టుగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు. అయితే ఎడమ చేయి , ఎడమ కాలు నొప్పి ఉందని చెప్పడంతో యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించాలని భావించి  ఆసుపత్రికి సీఎం ను తీసుకొచ్చామని డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.ECG, 2డీ ఈకో,  Angiogram పరీక్షల్లో నార్మల్ గా ఉందని తేలిందని ఆయన తెలిపారు. heart కు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. దీంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.. యాంజియోగ్రామ్ పరీక్షల్లో కూడా ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని డాక్టర్ ప్రమోద్ తెలిపారు. 

ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేశారని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. తనకు నీరసంగా ఉందని సీఎం చెప్పారన్నారు. ఎడమ చేయి లాగుతుందని చెప్పారు. డాక్టర్ ప్రమోద్ కుమార్ తో కలిసి వెళ్లి  పరీక్షలు చేశామన్నారు. MRI  పరీక్షలు కూడా నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు వివరించారు మెడ నొప్పి కారణంగా ఎడమ చేయి  నొప్పి ఉందని తాము తేల్చామని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. 

అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తే అన్ని పరీక్షల పలితాలు నార్మల్ గానే ఉన్నాయని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో 90 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.ఇంకా ఒకటి రెండు పరీక్షల పలితాలు రావాల్సి ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవాలని తాము సూచించామన్నారు.

ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో కొంత ఆయన నీరసంగా ఉన్నారని డాక్టర్ రావు అభిప్రాయపడ్డారు. ఇవాళ సాయంత్రం మూడు గంటలకు సీఎం ను ఆసుపత్రిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇక నుండి ప్రతి వారం  సీఎం కేసీఆర్ కు Sugar, BP పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.  మెడ, బ్రెయిన్ కు సంబంధించి  ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించామని ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.