పెళ్లి వేడుకలో భార్య శోభితతో నాగ చైతన్య వింత ప్రవర్తన, జనాల్లో భిన్న అభిప్రాయాలు!

First Published | Dec 14, 2024, 11:17 AM IST

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఇటీవల వివాహం చేసుకున్నారు. ఈ కొత్త జంట ముంబైలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు . సదరు వేడుకలో శోభితతో నాగ చైతన్య ఒకింత వింతగా ప్రవర్తించాడు. 
 

Naga Chaitanya

హీరో నాగ చైతన్య డిసెంబర్ 5న వివాహం చేసుకున్నారు. తన ప్రేయసి శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్ గా ఈ పెళ్లి ముగిసింది. కేవలం 300 మంది ప్రముఖులు, సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారు. నాగ చైతన్య నిర్ణయం మేరకు నిరాడంబరంగా వివాహం నిర్వహిస్తున్నామని నాగార్జున తెలిపారు. 

శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారి సాంప్రదాయంలో పెళ్లి తంతు జరిపారట. దాదాపు 8 గంటలు పెళ్లి కార్యక్రమం నడిచిందట. కట్టు, బొట్టు నుండి ప్రతి విషయంలో సాంప్రదాయం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారట. శోభిత, నాగ చైతన్య పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. ఈ వాదనలో నిజమెంతో తెలియదు. 

Tap to resize

శోభితతో రెండేళ్లకు పైగా నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారు. వీరి ప్రైవేట్ ఫోటోలు ఒకటి రెండు సందర్భాల్లో బయటకు వచ్చాయి. తరచుగా ఈ జంట విదేశాల్లో విహరించేవారని తెలుస్తుంది. తమపై వస్తున్న ఎఫైర్ రూమర్స్ ని నాగ చైతన్య దంపతులు ఖండిస్తూ వచ్చారు. సడన్ గా ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించారు. 

కాగా వివాహం అనంతరం మొదటిసారి ఓ సెలబ్రిటీ పెళ్లి వేడుకకు నాగ చైతన్య దంపతులు హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్ వివాహ రిసెప్షన్ లో వీరు సందడి చేశారు. కాగా కొత్త జంటను ఫోటోలు తీసేందుకు అక్కడి మీడియా ఆసక్తి చూపింది. 
 

ఫోటోలు దిగే క్రమంలో నాగ చైతన్య నీవు ఒక్కదానివే దిగని ఆమెకు సూచించాడు. శోభిత బ్రతిమిలాడే ప్రయత్నం చేసింది. కానీ నాగ చైతన్య నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే అక్కడి మీడియా జంటగా అలాగే, సింగిల్ గా సెలెబ్స్ ఫోటోలు తీస్తారు. ఫోటోగ్రాఫర్స్ డిమాండ్ మేరకు నాగ చైతన్య శోభితను సింగిల్ గా ఫోటోలు దిగమన్నారని తెలుస్తుంది. 

ఇక నాగ చైతన్య తండేల్ మూవీతో బిజీ. దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. 

Latest Videos

click me!