దిల్ రాజుతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు. అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు. రేవతి మృతి దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నేను బాగానే ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నాకు, నా కుటుంబ సబ్యులకు కఠిన సమయం. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేనేమీ మాట్లాడలేను. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు, అన్నారు.